కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే(2023-24) ను ప్రవేశపెట్టారు. మంగళవారం ఆమె సభలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే తొలి బడ్జెట్.
నిర్మల బడ్జెట్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆసక్తికరంగా లేనప్పటికీ, ఆర్థిక పరిపుష్టి కల్పించడంలో సఫలీకృతమైంది. ఈ సారి బడ్జెట్ ఏలా ఉండబోతుందనేది చూడాలి.