బీహార్ కి ప్రత్యేక హోదా గురించి ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన బడ్జెట్ సమావేశం లో బీహార్ కి చెందిన జేడీయూ ఎంపీ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి హోదా పొందటానికి ఉండాల్సిన 5 అర్హతలు బీహార్ కు లేవని తేల్చి చెప్పేశారు. ఈ విషయాన్ని ఇంటర్ మినీస్టీరియల్ గ్రూప్ (IMG) నివేదిక ఇచ్చిందని లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
*పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
*తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
*పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం.
*ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటుతనం
*రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు.తాజాగా బిహార్ కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టంచేసింది. దీని ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ కు కూడా ఈ అర్హతలు లేవు. అయితే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ , బీహార్ కూడా ఇదే తరహాలో డిమాండ్ పెడితే కేంద్రం మొగ్గు ఎటువైపనేది సందిగ్ధమేనని విశ్లేషకులు చెబుతున్నారు.