ఏపీకి ప్రత్యేక హోదా కావాలని టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని అడగలేదని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ తెలిపారు. “ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో బిహార్ కి, ప్రత్యేక హోదా కావాలని జేడీ(యూ) ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు మాత్రమే మాట్లాడారు. టీడీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు” అని ట్వీట్ చేశారు.
