కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన గంగిరెడ్డి ఈశ్వరరావు పై అదే గ్రామానికి చెందిన చేదులూరి గంగాధర్, కొంతమంది వ్యక్తులతో కలిసి ఇనుప రాడ్లతో దాడి చేశారు. గాయపడ్డ ఈశ్వరరావు పిఠాపురంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంగాధర్ గంజాయి మత్తులో ఉండటం వల్లే తనపై దాడికి పాల్పడ్డాడని ఈశ్వరరావు ఆరోపిస్తున్నాడు. గొల్లప్రోలు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు
