కాకినాడ కల్పనా సెంటర్లో ఘోరంగా కారు, మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. కారు వేగంగా వచ్చి మోటార్ సైకిల్ ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.మద్యం మత్తులో కారు నడిపారా అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలాన్ని కాకినాడ డిఎస్పి హనుమంతరావు పరిశీలించారు.
