తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిని ఆ పార్టీ నాయకులు, క్యాడర్ ఘనంగా సత్కరించాయి. టీడీపీ రాజానగరం నియోజకవర్గం ఇన్చార్జ్ గా వెంకటరమణ చౌదరి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని బూరుగుపూడి గేటు వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో తెలగంశెట్టి శ్రీను, రొంగల శ్రీను, కట్టా సత్తిబాబు ఆధ్వర్యంలో బొడ్డు వెంకటరమణ చౌదరిని గజమాలతో సత్కరించారు.
