కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రసిద్ధి చెందిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక క్షేత్రం డాక్టర్ ఉమర్ ఆలీషా పీఠంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. చిత్రాడ రోడ్డులోని ఆశ్రమంలో స్వామిజీ ఉమర్ ఆలీషా భక్తులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతీయేటా గురుపౌర్ణమి వేడుకను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఆలీషా మంత్రోపదేశం కూడా ఉంటుంది.
