కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటారుసైకిల్ పై లిఫ్ట్ ఇస్తున్నట్టుగా నటించి సినీ ఫక్కిలో నగదు కాజేస్తున్నారు. చేబ్రోలుకు చెందిన పెండ్యాల రామకృష్ణ ఈ కోవలోనే మోసపోయాడు. పిఠాపురం ఉప్పాడ బస్టాండు వద్ద చేబ్రోలు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న రామకృష్ణ వద్దకు గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి, లిఫ్ట్ ఇచ్చాడు. మార్గం మధ్యం ఉండగా ఆపీ, తలపై మోదీ రూ.10 వేలు నగదు దోచేశాడు.
