ఒకపక్క గోదావరి ఉధృతి పెరగడం కోనసీమ జిల్లాలో ఏటిగట్లు బలహీనపడటం ప్రజల ఆందోళన చెందుతున్నారు. కాట్రేనికోన మండలం కొండలేశ్వర వద్ద ఏటిగట్టు పంటకాలవైపు కొంగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం హుటాహుటీన బయలుదేరి కుండలేశ్వరం వెళ్లారు. అక్కడ కుంగిన ఏటుగట్టును పరిశీలించి రక్షణ గోడకు తాత్కాలిక గ్రావెల్స్ నింపి రక్షణ కల్పించాలంటూ జల వనరుల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
