డ్రైనేజిలు,ఇరిగేషన్ కాలువల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కోరారు.అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెదపూడి మండలానికి సంబంధించి భారీ వర్షాలు, తుఫానుల సందర్భాల్లో పంట పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు.









