Search
Close this search box.

  తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల వాయిదా..

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరగాల్సి ఉంది. డిసెంబర్ నెలకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పలు కారణాల వల్ల పరీక్షల నిర్వహణ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఆగస్ట్ 7, 8 తేదీల్లోనే పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు ఉండటం… ఆ వెంటనే గ్రూప్-2 పరీక్షలు ఉండటంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. నిరుద్యోగులు ఛలో సెక్రటేరియట్ తో పాటు పలు ధర్నాలు నిర్వహించారు. దీంతో, ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు