Search
Close this search box.

  పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తాను.. ఆయనే న్యాయం చేస్తారు..!

ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పేరు ప్రస్తుతం మీడియాను షేక్ చేస్తుంది. లావణ్య అనే యువతిని ప్రేమించి, పెళ్ళాడి మోసం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్.. తనను పెళ్లి చేసుకొని, కాపురం చేస్తూ.. కొత్త హీరోయిన్ మాల్వీతో ఎఫైర్ పెట్టుకొని ఇప్పుడు వదిలించుకుంటున్నాడని ఆరోపించింది.

ఇంకోపక్క రాజ్ తరుణ్.. ఆమెను ప్రేమించిన మాట వాస్తవమే కానీ, ఆమె డ్రగ్స్ తీసుకోవడం, వేరొక వ్యక్తితో కలిసి ఉండడంచేయడం వలన బ్రేకప్ చెప్పానని చెప్పుకొచ్చాడు. అలా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. రాజ్ తరుణ్ చేసిన ఆగడాలు అన్ని లావణ్య మీడియా ముందు ఏకరువు పెట్టింది. అబార్షన్ చేయించాడని, అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నాడని ఇలా చెప్పుకొస్తూనే ఉంది. రాజ్ తరుణ్.. లావణ్య తాగి మాట్లాడిన ఆడియోను రిలీజ్ చేసి ఆమె ఒక తాగుబోతు అన్నట్లు క్రియేట్ చేశాడు.

ఇక తాజాగా లావణ్య.. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తాను అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే చాలా ఇష్టమని, ఆయనకు వీరాభిమానిని అని చెప్పిన లావణ్య.. రాజ్ తరుణ్ తనకు చేసిన అన్యాయాన్ని ఆయనకు వివరించి తనకు న్యాయం చేయమని కోరతానని తెలిపింది.

అంతేకాకుండా పవన్ పెళ్లిలా గురించి కూడా మాట్లాడింది. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. వదిలేసినా.. వారంటే గౌరవంగా ఉంటారని, పిల్లలను మంచిగా చూసుకుంటారని తెలిపింది. రాజ్ తరుణ్ తనను, పిల్లలను కూడా పట్టించుకోడని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్తుందా.. ? వెళ్తే ఆయన ఎలాంటి న్యాయం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు