Search
Close this search box.

  మళ్ళీ కెమెరా ముందుకు విజయ్..! కానీ..?

November 6, 2026 6:53 AM | Aditya369 News

మళ్ళీ కెమెరా ముందుకు విజయ్..! కానీ..?

సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి ఆయన కనిపించబోయేది సినిమా కోసం కాదు.. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాడ్‌లో కావడం విశేషం.

తన చివరి చిత్రం జననాయగన్ పూర్తయిన తర్వాత సినిమాలకు దూరమైన విజయ్, తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ఎలాంటి సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొనలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం, ఓ ప్రభుత్వ ప్రకటన షూటింగ్ కోసం విజయ్ రెండు రోజుల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ యాడ్‌కు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారట. అంతేకాకుండా సాధారణ ప్రభుత్వ ప్రకటనల మాదిరిగా కాకుండా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ యాడ్‌ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

దీంతో విజయ్ మళ్లీ కెమెరా ముందుకు వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇది కేవలం ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రచార కార్యక్రమం మాత్రమేనని, దీని ద్వారా విజయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని అనుకోవద్దని తెలుస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore