Search
Close this search box.

  నయన్ కు పొగరెక్కువ.. ప్రభాస్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన ఆ అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ.. కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా మారింది. అయితే ఆమెకు మొదట నుంచి పొగరు ఉందని ఇండస్ట్రీలో టాక్. ఆమె ప్రమోషన్స్ కు రాదని, ఎంత బతిమిలాడినా సినిమా తరువాత కనిపించాడని ఎంతోమంది చెప్పుకొచ్చారు.

 

తాజాగా డైరెక్టర్ మారుతీ సైతం నయన్ కు పొగరు ఉందని చెప్పుకురావడం గమనార్హం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతీ, నయనతార గురించి చెప్పుకొచ్చాడు. మారుతీ దర్శకత్వం వహించిన బాబు బంగారం సినిమాలో వెంకటేష్ కు జోడిగా నయన్ నటించింది. ఆ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ను, ఆమెతో జరిగిన మారుతీ తెలిపాడు.

 

” బాబు బంగారం సినిమా సమయంలో నయన్ అస్సలు సహకరించలేదు. ఎంతో పొగరుగా మాట్లాడేది. నేను స్టార్ డైరెక్టర్ ను కాకపోవచ్చు.. నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు. సీనియర్ హీరో అయిన వెంకటేష్ ను కూడా ఆమె లెక్కచేయలేదు. ఇక నాకు ఓపిక నశించి.. సెట్ లోనే ఆమెతో గొడవపడ్డాను. దానికి ఆమె కోప్పడి సెట్ నుంచి వెళ్ళిపోయింది. సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది అని కాల్ చేస్తే.. డేట్స్ లేవని చెప్పి తప్పించుకుంది.

 

ఇక ఆమె రాకపోవడంతో సాంగ్ లేకుండానే సినిమాను రిలీజ్ చేశాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం మారుతీ.. ప్రభాస్ హీరోగా రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో మారుతీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు