తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వెనుక అంతరార్థం ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. పార్టీ పరంగా ఆయన జోష్ ఇచ్చినప్పటికీ ఏపీలో షర్మిల 2029లో గెలుస్తుందని సీఎం కాబోతుందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి
ఆంఆంధ్రప్రదేశ్ ఏం జరగబోతోంది అని చెప్పడానికి కాంగ్రెస్ పుంజుకుంటుందా. భవిష్యత్తులో ప్రత్యామయం కాంగ్రెస్ పార్టీయేనా అనే దానిపై ఇప్పుడు చర్చ రేగింది.
ఏపీకి 2029లో వైఎస్ షర్మిల సీఎం అవుతారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.వైఎస్ఆర్ 1999లో పోషించిన ప్రతిపక్ష పాత్రను ఆమె ఇప్పుడు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయన ఆశయాల కోసం ముళ్లబాటను ఎంచుకున్నారని ప్రశంసించారు.ప్రతీ పోరాటానికి ఒక సమయం వచ్చినప్పుడు ప్రజలు ఆధరిస్తారని వ్యాఖ్యానించారు. కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం వృథా కాదని తెలిపారు.వైఎస్ షర్మిలకు తామంతా అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు . మీడియాలో జరుగు తున్నట్లు కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నిక వస్తే ఆమె తరపున తాను ఊరూరా తిరిగి ప్రచారం చేస్తానని సీఎం రేవంత్ తెలిపారు. ఎక్కడైతే పార్టీ ఓడిపోయిందో అక్కడి నుంచే అధికారం తెచ్చుకుంటామని అన్నారు. ఢిల్లీకి కడప పౌరుషం చూపించే అవకాశం వస్తే కచ్చితంగా ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ వ్యాఖ్యనించారు.