జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనాన్ని తయారు చేయించి దానికి వారాహి అని పేరు పెట్టిన తర్వాత వారాహి అనే పదం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల పవన్ వారాహి అమ్మ వారి దీక్ష తీసుకున్నారు. అప్పటినుంచి అమ్మ వారి గురించి అందరూ తెలుసుకుంటున్నారు.
నెటిజెన్లు గూగుల్లో వెతుకుతున్నారు .మొత్తం మీద అమ్మవారి గురించి అందరికీ తెలిసింది .తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ లో అమ్మవారి ఆలయం ఉంది. కాశీలో రెండు చోట్ల ఉంది అని చెబుతుంటారు. అరుణాచలం వెళ్లే దారిలో కూడా ఆలయం ఉందని కూడా కొందరి మాట.అయితే వారాహి అమ్మవారి ఆలయాలు ఎక్కడెక్కడున్నాయనేదిపై స్పష్టత లేదు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరులో నూతనంగా వారాహి అమ్మవారి ఆలయాన్ని లక్ష్మీ ప్రసన్న అనే భక్తురాలు నిర్మించి అందర్ని ఆశ్చర్య పరిచారు. ఆమె అమ్మవారి భక్తురాలు.అమ్మ తనలోనే ఉంటుందని చెబుతోంది. ఆలయం నిర్మించడంతో అక్కడికి భక్తులు దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. తన సోదరుడు అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు తాను అమ్మవారి పూజ చేస్తూ సోదరుదుని దగ్గర కూర్చోబెట్టుకున్నా ఆ మంత్రాల ని విన్న తర్వాత అతని ఆరోగ్యం బాగుపడిందని ఆలయ నిర్మాత అంటున్నారు.
ఆషాడ మాసం పాడ్యమి నుంచి అమ్మవారి మాలలు ధరించిన భక్తులు పెరిగారు. ప్రస్తుతం 100 మంది భక్తులు మాల ధరించి అక్కడే ఉంటున్నారు. కొంతమందికి అమ్మవారి ఫోటో ఇంటిలో ఉండకూడదని అపోహాలు ఉంటాయి .అలాంటిదేమీ లేదు .ఫోటో ఇంటిలోనే పెట్టుకోవచ్చు అంటున్నారు లక్ష్మీ ప్రసన్న. ఆమెను ఓ దేవతగా కాకుండా కన్నతల్లిగా లేదా కన్నబిడ్డగా చూడండి .ఆరాధించండి. ప్రేమించండి. ఆమె మహాత్యం తెలుస్తుంది అని చెబుతున్నారు .
అక్కడికి వచ్చిన కొంత మంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు. వారిని పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆలయంలో ఫోటోలు తీస్తున్నారు. కాళ్లు కడుక్కోకుండా వస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయానికి స్వస్తి పలకండి. ప్రతిరోజు రాత్రిళ్ళు పూజ చేయండి అంటూ పూనకం వచ్చిన మహిళలు చెప్పడం జరిగింది. వారు ఇక్కడికి చెందినవారు కాదు.అలా చెప్పించారు అనడానికి . వారు ఇద్దరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు .ఇదే మొదటిసారి వారు ఇక్కడికి రావడం. అమ్మ ఇక్కడ ఉంది అనడానికి ఇదే నిదర్శన మంటున్నారు అది చూసిన భక్తులు.మొత్తం మీద కాకినాడ రూరల్ కొవ్వూరులో వారాహి అమ్మ వారు కొలువుదీరారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.