Search
Close this search box.

  ట్రూకాల‌ర్ లేకుండా కాల‌ర్ ఎవ‌ర‌నేది తెలుసుకోవ‌చ్చు..ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానం ఎప్ప‌టి నుండి అమ‌లులోకి వ‌స్తోందంటే..!

July 5, 2024 7:07 PM | Aditya369 News

ట్రూకాల‌ర్ లేకుండా కాల‌ర్ ఎవ‌ర‌నేది తెలుసుకోవ‌చ్చు..ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానం ఎప్ప‌టి నుండి అమ‌లులోకి వ‌స్తోందంటే..!

ఇప్పుడు అంద‌రి మొబైల్ ఉండే ట్రూకాల‌ర్ ఇప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతోంది. గుర్తు తెలియ‌ని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ సాధార‌ణంగా వాడుతున్నారు. ఈ ట్రూకాల‌ర్ ద్వారానే మ‌న ఫోన్ బుక్‌లో సేవ్ కాని నెంబ‌ర్ల వివ‌రాలు ఇట్టే తెలుసుకుంటున్నారు. దాదాపు మొబైల్ యూజ‌ర్స్ మొత్తం దీనిపైనే ఆధార‌ప‌డుతున్నారు.

దీనికి తోడుగా మ‌రిన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి థర్ట్ పార్టీ యాప్స్ ను ఉపయోగిచే సమయంలో మీ ఫోన్ కాల్స్ కి సంబంధించిన పర్మిషన్స్ యాప్ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్లోని కాంటాక్ట్స్ తో పాటు కాల్ వివరాలను సదరు యాప్స్ చేరుతాయి.

అయితే ఇలాంటి సమస్య లేకుండా, అసలు ఏ యాప్ అసవరం లేకుండానే ఇకపై అన్ నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్ తెలుసుకోవచ్చు. ఇందుకోసమే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీకు వచ్చే కాల్స్ వివరాలు ఏ యాప్ అవసరం లేకుండా స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ట్రాయ్.. నేమ్ ప్రెజెంటేషన్ సర్వీస్ ను యాక్టివేట్ చేయనుంది. జూలై 15వ తేదీ నుంచి ఈ సేవలను ట్రాయ్ ప్రారంభించనుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు