Search
Close this search box.

  ప్రధాని మోదీకి బీసీసీఐ స్పెష‌ల్ గిఫ్ట్‌..!

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ గెలిచిన రోహిత్ సేన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. గురువారం ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగిన టీమిండియా ప్లేయ‌ర్లు.. ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో మోదీని క‌లిశారు. ప్ర‌ధానితో క‌లిసి వారు అల్పాహారం చేశారు. ఈ సంద‌ర్భంగా మోదీ ప్ర‌తి క్రికెట‌ర్ వ‌ద్దకు వెళ్లి అప్యాయంగా ప‌ల‌క‌రించి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ స్పెష‌ల్ గిఫ్ట్ అంద‌జేసింది. ‘నమో’ నం. 01 పేరిట ఉన్న‌ ప్రత్యేక టీమిండియా జెర్సీని ఆయ‌న‌కు అందజేసింది. జ‌ట్టు స‌భ్యుల‌ సమక్షంలో బీసీసీఐ సెక్రటరీ జైషా, అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఈ స్పెష‌ల్‌ జెర్సీని మోదీకి అంద‌జేశారు. ఇక ప్రధాని మోదీతో భేటీ అనంతరం భార‌త‌ జట్టు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు