Search
Close this search box.

  ఛోటా కె.ప్రసాద్ కి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్

ఛోటా కె.ప్రసాద్ కి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్

బెస్ట్ ఎడిటర్ అవార్డుకి ఎంపిక చేసిన కళావేదిక మ్యాగజైన్

శ్రీ విష్ణు హీరోగా నటించగా మంచి ప్రేక్షకాదరణ పొందిన సామజవరగమన సినిమాకి బెస్ట్ ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నారు.కళావేదిక మ్యాగజైన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులని ఇస్తోంది.ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్ ని హైదరాబాద్ లో నిర్వాహకుల నుంచి అందుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ప్రసాద్ త‌న బాబాయి ఛోటా కె.నాయుడు ప్రోత్సాహంతో హైదరాబాద్ వెళ్లి ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు వద్ద చేరి ఎడిటింగ్ లో మెళకువలు నేర్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఎడిటర్ స్థాయికి చేరుకున్నారు.ఛోటా కె.నాయుడు మేనల్లుడు,బావ సందీప్ కిషన్ హీరోగా నటించిన టైగర్ సినిమాతో ఎడిటర్ అయ్యారు. ఎడిటర్ అయ్యాక…తన ఎదుగుదలకి సహకారం అందించిన ప్రముఖ కెమెరామన్,బాబాయి ఛోటా కె.నాయుడు పేరులో తొలి భాగాన్ని తన నేమ్ ముందు చేర్చుకున్నారు ప్రసాద్.ఆ విధంగా ఆయన ఛోటా కె.ప్రసాద్ అయ్యారు. 2017లో విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాకి ఛోటా కె.ప్రసాదే ఎడిటర్.వాల్మీకి,ఎక్కడికి పోతావు చిన్నవాడ,సామజవరగమన,నాంది తదితర చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు.

ఛోటా కె.ప్రసాద్ కి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గ‌త ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య సినిమాకి సపోర్టింగ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు.ఈ సినిమాకి సపోర్టింగ్ ఎడిటర్ గా ప్రసాద్ పనితనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుని మెగాస్టార్ ఆయనను సత్కరించారు.ఈ ఏడాదిలో సంక్రాంతికి విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున సినిమా నా సామిరంగ, ఇటీవల విడుదలైన సందీప్ కిషన్ సినిమా ‘ఊరి పేరు భైరవ కోన’లకి ఎడిటర్ గా ప్రసాద్ ప‌నిచేశారు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు