Search
Close this search box.

  మాకు ప్రాధాన్య‌త ఇవ్వాల్సిందే..కూట‌మిలో కుంప‌టి రేపిన జ‌న‌సేన ఇన్‌ఛార్జి వాఖ్య‌లు

మాకు ప్రాధాన్య‌త ఇవ్వాల్సిందే..కూట‌మిలో కుంప‌టి రేపిన జ‌న‌సేన ఇన్‌ఛార్జి వాఖ్య‌లు

చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఒకే మాట‌పై ఒకే తాటిపై వెళుతుంటే కూట‌మిలో ఉన్న క్షేత్ర‌స్థాయి నాయ‌కులు మాత్రం కుంప‌టి రాజేసుకుంటున్నారు. ఒకొక్క ప్రాంతంలో ఒక్కొ ర‌క‌మైన స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. నిన్న‌టి పింఛ‌న్ల పంపిణీలో టిడిపి, జ‌న‌సేన నాయ‌కులు వాదోప వాద‌లు చేసుకున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోప‌క్క తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వూరు జ‌న‌సేన ఇన్‌చార్జి టి.వి. రామారావు చేసిన వాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

జనసేన, బిజెపి, టీడీపీ కలిస్తేనే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిందని కొవ్వూరు జ‌న‌సేన ఇన్‌చార్జి టి.వి.రామావు అన్నారు. రాష్ట్రం లో తమ నాయకుడు ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, సి.ఎం చంద్రబాబు నాయుడు కలిసి పరిపాలన క్షేత్ర‌స్థాయిలో మాత్రం చేస్తున్నప్పటికీ, గ్రామాల్లో పరిస్థితి మాత్రం అలా లేదని రామారావు అన్నారు.

పైడిమెట్ట ఎత్తి పోతల పధకం నూతన కమిటీ సమావేశానికి విచ్చేసిన ఆయన ఎత్తి పోతల కమిటీ లో జనసేన పార్టీ కి చెందిన వారెవరిని తీసుకోక పోవటాన్ని గుర్తించి ఆయన తీవ్రంగా పరిగణించారు. రాష్ట్ర పరిపాలనలో భాగస్తులైన‌ప్పుడు మండలంలో పరిపాలనలో గుర్తింపు ఇవ్వరా అని అన్నారు. నియోజక వర్గంలో చాలా చోట్ల తమ పార్టీ తమ పార్టీ క్యాడ‌ర్‌ను కలుపు కోవటం లేదన్నారు. ఇలా వారికి ప్రాధాన్యత కల్పించక పోతే, తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని బహిరంగంగానే విష‌యాన్ని వెల్లడించారు. కలిసి పని చేస్తామని, కలిసి నడుద్దామని టి.వి.ఆర్ స్నేహ భావాన్ని వ్యక్త పరిచారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ కొవ్వూరు నియోజక వర్గ పరిశీలకులు గొర్రెల శ్రీధర్ వెంటనే స్పందించి ప్రజల కు చేసే మేలు కోసం అన్ని పార్టీల ను గౌరవించాలని, నియోజక అభివృద్ధికి మూడు పార్టీల వారు కలిసి పని చేయాలని పిలుపు నిచ్చారు.

ఇదిలా ఉంటే టి.వి.రామారావు చేసిన వాఖ్య‌లు కూట‌మి లో ఉన్న క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సే, టిడిపి, బీజేపీ నేత‌ల తీరునైతే మాత్రం ప్ర‌శ్నించేట‌ట్టుగా ఉన్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎన్టీయే భాగ‌స్వామ్య ముఖ్య నేత‌లు క‌లిసుంటే, ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారం లేక అత్రుత‌తో ఉన్న కింద స్థాయి క్యాడ‌ర్ ఓపిక‌తో ఉండ‌టం లేద‌న్న‌ది ఇందులో గ‌మ‌నించాల‌ని చెబుతున్నారు. క్యాడ‌ర్ ముఖ్య నేత‌ల‌ను అనుస‌రించాలి త‌ప్పితే, దారి త‌ప్పి, ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని వారు చెబుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు