Search
Close this search box.

  ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల కొరత.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..!

మన దేశంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) పరిధిలో జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (సబ్ హెల్త్ సెంటర్లు).. ఇలా మొత్తంగా 2 లక్షల పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలు ఉన్నాయి. అయితే, వీటిలో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్) కు అనుగుణంగా ఉన్నవి కేవలం 20 శాతం మాత్రమేనని, మిగతా వాటిలో కనీస సదుపాయాలు లేవని తాజా సర్వే ఒకటి తేల్చింది. వీటిలో సిబ్బంది, ఎక్విప్ మెంట్, ప్రమాణాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సెల్ఫ్ అసెస్ మెంట్ సర్వేలో బయటపడింది.

సర్వేలో భాగంగా ఆసుపత్రులలో సదుపాయాలు, వైద్యులు, నర్సులు, వైద్య పరికరాలు, మందులు, అత్యవసర సర్వీసులు, ఇతర వివరాలను నమోదు చేసేందుకు ఓ డ్యాష్ బోర్డును ప్రారంభించింది. మొత్తం 2 లక్షల ఆసుపత్రులకు గానూ 40 వేల ఆసుపత్రులు ఇందులో తమ వివరాలను నమోదు చేశాయి. వాటి వివరాలను విశ్లేషించగా.. కేవలం 8,089 ఆసుపత్రులు మాత్రమే ఐపీహెచ్ఎస్ స్టాండర్డ్స్ ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలు కలిగి ఉన్నాయని తేలింది. ఇవి 80 శాతం స్కోర్ సాధించగా.. మరో 17,190 ఆసుపత్రులు 50 శాతం కంటే తక్కువగా, మిగతా 15,172 ఆసుపత్రులు 50 నుంచి 80 శాతం మధ్యలో స్కోర్ చేశాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు