కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీలోని శ్రీ ఆదర్శ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు విశాఖపట్నంలో బోల్తా పడింది. పిఠాపురం నుండి పిక్నిక్ కు వెళ్లిన పాఠశాలల బస్సులో ఓ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. ఆసమయంలో బస్సు లో 37 మంది పిల్లలున్నారు. కైలాసగిరి వద్ద మలుపు తిరిగే క్రమంలో బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్లి, తిరగబడింది. ప్రమాదంలో బస్సు మాత్రమే దెబ్బతిందని అరి లోవ సిఐ శ్రీనివాస్ తెలిపారు. అదృష్టవశాత్తు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్దగాయాలు కాకపోవడం, ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకు న్నారు. విద్యార్థులను మరో బస్సులో ఎక్కించి క్షేమంగా పిఠాపురం తీసుకొస్తున్నారు.








