Search
Close this search box.

  రామాయణ 2 వర్సెస్ వారణాసి.. విజువల్ వార్ మొదలైందా .?

November 7, 2026 10:33 AM | Aditya369 News

రామాయణ 2 వర్సెస్ వారణాసి.. విజువల్ వార్ మొదలైందా .?

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ ఇప్పటికే తన అద్భుతమైన విజువల్స్‌తో సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా విజువల్ పరంగా మరో స్థాయిలో ఉండబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న రెండో భాగంపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ అంచనాలకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ రూపంలో మరో పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’లో రామాయణానికి సంబంధించిన ఓ కీలక ఘట్టాన్ని ప్రత్యేకంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జక్కన్న సినిమాల్లో విజువల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తనదైన మేకింగ్ స్టైల్‌తో ఆ ఎపిసోడ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మాత్రం థియేటర్లలో అద్భుతమైన అనుభూతి కలగడం ఖాయం. అదే జరిగితే రామాయణం రెండో భాగంపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మొదటి భాగంతో ఇప్పటికే ఆసక్తి పెంచిన నితీష్ తివారీ టీమ్, రెండో భాగంలో అంతకుమించిన విజువల్ గ్రాండియర్‌ను అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ రెండు భారీ చిత్రాల్లో రామాయణ ఘట్టాలను దర్శకులు ఏ స్థాయిలో ఆవిష్కరిస్తారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore