టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రెస్టీజియస్ 100వ చిత్రం ‘కింగ్ 100’. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు రావడంతో ‘కింగ్ 100’ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
నాగార్జునతో ఢీకొట్టబోతున్న అశోక్ సెల్వన్!
దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్‌తో గతంలో ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాలో కలిసి పనిచేసిన తమిళ నటుడు అశోక్ సెల్వన్.. ఇప్పుడు ‘కింగ్ 100’లో విలన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.
అంటే.. ఈ సినిమాలో కింగ్ నాగార్జునకు అశోక్ సెల్వన్ విలన్‌గా తలపడబోతున్నారన్నమాట.
ఇప్పటివరకు హీరోగా, విభిన్న పాత్రల్లో మెప్పించిన అశోక్ సెల్వన్.. నాగార్జున వంటి సీనియర్ స్టార్‌తో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎలా ఢీకొంటారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
ముఖ్యంగా నాగార్జున, అశోక్ సెల్వన్ మధ్య వచ్చే యాక్షన్, కాన్‌ఫ్రంటేషన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి.
భారీ కాస్ట్‌తో ‘కింగ్ 100’!
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, ఐశ్వర్య రాజేష్, సుష్మిత భట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా కావడంతో.. ‘కింగ్ 100’పై అక్కినేని అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.
మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరి నాగార్జున–అశోక్ సెల్వన్ మధ్య కాన్‌ఫ్రంటేషన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో.. ‘కింగ్ 100’ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!








