Search
Close this search box.

  దేవర 2 ఇక లేనట్టేనా..? రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్..!

September 27, 2026 6:43 PM | Aditya369 News

దేవర 2 ఇక లేనట్టేనా..? రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘దేవర’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించింది.

ఇక ‘దేవర’ విడుదలై రెండేళ్లు పూర్తైన సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ డేని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్‌గా వేసిన స్పెషల్ షోలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ‘దేవర’కు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలం పాటు సీక్వెల్‌పై కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.

ఎందుకంటే ‘దేవర’ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన పోస్టులో కూడా ‘దేవర 2’ గురించి ఎలాంటి ప్రస్తావన కనిపించలేదు. గతంలో వచ్చిన అప్డేట్స్‌లో సీక్వెల్ గురించి హింట్స్ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు ఇంత కీలకమైన రోజున కూడా ఎలాంటి మెన్షన్ లేకపోవడంతో ‘దేవర 2’పై అనుమానాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే కొంతకాలంగా ‘దేవర 2’ ఆగిపోయిందనే రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాబట్టి ప్రస్తుతం ‘దేవర 2’ లేదని అధికారికంగా చెప్పడం కంటే.. సీక్వెల్ పరిస్థితి అనిశ్చితంగా ఉందని చెప్పడం సరైనది.

మరి నిజంగానే ‘దేవర 2’ క్యాన్సిల్ అయిందా? లేక భవిష్యత్తులో మళ్లీ ఈ ప్రాజెక్ట్‌పై అప్డేట్ వస్తుందా అనేది చూడాలి.

ఇక ‘దేవర’కు అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు