సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో మరింత హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే సినిమాలోని కీలక పాత్రలను కూడా ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ‘జైలర్ 2’ నుంచి సెకండ్ సాంగ్‌పై మేకర్స్ కీలక ప్రకటన చేయబోతున్నారు. ఈ పాట ఏంటి? ఎప్పుడు విడుదల కానుంది? అనే విషయాలను సెప్టెంబర్ 23న అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు.
దీంతో ఇప్పుడు అందరి చూపు అనిరుధ్‌పై పడింది. ఫస్ట్ సాంగ్‌తో అదరగొట్టిన అనిరుధ్.. ఈసారి తలైవర్ కోసం ఎలాంటి సాంగ్‌ను డిజైన్ చేశాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు విద్యా బాలన్, ఎస్.జే. సూర్య, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
మరి సెప్టెంబర్ 23న రాబోయే సెకండ్ సాంగ్ అప్డేట్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి!








