మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చరణ్, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
అయితే రామ్ చరణ్‌కు సంబంధించి ఇప్పుడు సినీ వర్గాల్లో మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఎవరూ ఊహించని ఓ కాంబినేషన్‌లో చరణ్ సినిమా చేయబోతున్నారనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
‘తానాజీ’, ‘ఆదిపురుష్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓం రౌత్.. రామ్ చరణ్‌కు ఇటీవల ఒక కథను వినిపించినట్లు సమాచారం. ఈ కథ చరణ్‌కు కూడా నచ్చడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓం రౌత్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది.
ఓం రౌత్ గత సినిమాల తరహాలోనే ఈ ప్రాజెక్ట్‌ను కూడా భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ గ్రాఫిక్స్‌తో ఒక విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్, ఓం రౌత్ కాంబినేషన్‌కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మెగా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందా? లేక ఇది కేవలం ప్రాథమిక చర్చలకే పరిమితం అవుతుందా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.







