Search
Close this search box.

  ఉగాది బరిలో మెగాస్టార్ విశ్వంభర..!

September 16, 2026 7:49 AM | Aditya369 News

ఉగాది బరిలో మెగాస్టార్ విశ్వంభర..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే సినిమా విడుదలకు సంబంధించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ కూడా పూర్తయినట్లు సమాచారం. దీంతో సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ‘విశ్వంభర’ను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అదే సమయంలో సంక్రాంతి సీజన్‌లో ఉన్న ఇతర సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది.

దీంతో ఒకవేళ సంక్రాంతికి ‘విశ్వంభర’ విడుదల కాకపోతే, మేకర్స్ ముందు మరో ఆప్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఉగాది సీజన్. సంక్రాంతి మిస్ అయితే ఉగాది సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు టాక్.

అయితే ఓటీటీ డీల్ ఇప్పటికే పూర్తవడంతో వీలైనంత త్వరగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ‘విశ్వంభర’ సంక్రాంతికే వస్తుందా? లేక ఉగాదికి షిఫ్ట్ అవుతుందా? అనేది అధికారిక రిలీజ్ డేట్ ప్రకటన వచ్చిన తర్వాతే క్లారిటీ రానుంది.

ఇక ఈ భారీ ఫాంటసీ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore