Search
Close this search box.

  సమంత బిడ్డకు అభిమాని పెట్టిన పేరు..! హీరోయిన్ రియాక్షన్ వైరల్..!

August 31, 2026 8:39 PM | Aditya369 News

సమంత బిడ్డకు అభిమాని పెట్టిన పేరు..! హీరోయిన్ రియాక్షన్ వైరల్..!

టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత త్వరలో తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సమంత.. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమె భవిష్యత్ పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.

పిల్లలకు పేరు పెట్టడం అంత సులభమైన విషయం కాదని, ఈ విషయంలో అభిమానుల సాయం కూడా కావాలని సమంత సరదాగా స్పందించినట్లు సమాచారం.

దీంతో ఓ అభిమాని సమంతకు పాప పుడితే ‘సమైరా’ అనే పేరు పెట్టాలని సూచించారు. సమంత, రాజ్ పేర్లు కలిసొచ్చేలా ఈ పేరును సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అబ్బాయి పుడితే ‘సామ్రాజ్’ అనే పేరు పెట్టాలని కూడా సూచించారు.

అభిమాని చేసిన ఈ కామెంట్‌పై సమంత సరదాగా స్పందించారు. ‘మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?’ అంటూ స్మైలీ ఎమోజీలతో రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సమంత చేసిన ఈ సరదా స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో సమంత యాక్టివ్
ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా సమంత చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫిట్‌నెస్, వర్కౌట్స్‌కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

మరోవైపు సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఆమె తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మొత్తానికి సమంతకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు