తమిళ సినిమా పరిశ్రమలో టాప్ డైరెక్టర్లుగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు శంకర్, ఏఆర్ మురుగదాస్. భారీ కమర్షియల్ సినిమాలతో పాటు సోషల్ మెసేజ్‌ను కూడా తనదైన స్టైల్‌లో తెరపై చూపిస్తూ శంకర్ ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. మరోవైపు మురుగదాస్ కూడా కమర్షియల్ యాక్షన్ సినిమాలకు సోషల్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం వీరిద్దరూ గతంలో ఉన్నంత ఫామ్‌లో లేకపోయినా.. వీరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది.
శంకర్, మురుగదాస్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఇద్దరూ కలిసి దర్శకత్వం వహించే సినిమా కాదట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మురుగదాస్ మరియు ఆయన టీమ్ సిద్ధం చేసిన కథతో శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాక్.
ఇలాంటి కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం అది చాలా క్రేజీ కాంబినేషన్‌గా మారడం ఖాయం. ఎందుకంటే శంకర్‌కు ఉన్న భారీ విజన్, మురుగదాస్‌కు ఉన్న కమర్షియల్ కథన శైలి రెండూ కలిస్తే ఎలాంటి సినిమా వస్తుందోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇది ప్రస్తుతానికి ఇండస్ట్రీలో వినిపిస్తున్న క్రేజీ బజ్ మాత్రమే. అయితే ఈ వార్త నిజమైతే మాత్రం తమిళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.
మరి శంకర్–మురుగదాస్ కాంబినేషన్ నిజంగా కార్యరూపం దాల్చుతుందా? లేక ఇది కేవలం ఇండస్ట్రీ రూమర్‌గానే మిగిలిపోతుందా? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








