సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న ‘రోమాంచకం’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్ ప్రారంభంలో ‘రోమాంచకం’ ఒక క్యూట్ లవ్ స్టోరీలా అనిపించినప్పటికీ.. కథ ముందుకు సాగుతున్న కొద్దీ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే విభేదాలు, అనుకోని ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నేటితరం రిలేషన్షిప్స్లో కనిపించే ప్రేమ, గొడవలు, ఎమోషన్స్‌ను చాలా సహజంగా చూపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ అందించిన బీజీఎం, ఆకట్టుకునే డైలాగ్స్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే ‘రోమాంచకం’ ఒక పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.








