Search
Close this search box.

  ‘ది ప్యారడైజ్’ రెండో పాటపై క్రేజీ అప్డేట్..! అనిరుధ్ మరోసారి రచ్చ చేయనున్నాడా..?

August 25, 2026 7:28 PM | Aditya369 News

‘ది ప్యారడైజ్’ రెండో పాటపై క్రేజీ అప్డేట్..! అనిరుధ్ మరోసారి రచ్చ చేయనున్నాడా..?

నాచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన తొలి పాటకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాసర్ల శ్యామ్ పవర్‌ఫుల్ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్ తన మాస్ బీట్స్‌తో పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయింది.

ఇక ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ది ప్యారడైజ్’ రెండో పాటకు సంబంధించిన రికార్డింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. అనిరుధ్ రవిచందర్, కాసర్ల శ్యామ్ కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలో అనిరుధ్.. కాసర్ల శ్యామ్‌కు నమస్కరిస్తుండగా, శ్యామ్ ఆయనను ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ రెండో పాట రికార్డింగ్ పూర్తయిందనే విషయాన్ని శ్రీకాంత్ ఓదెల తెలియజేశారు. త్వరలోనే ఈ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్‌ను చూస్తే.. అనిరుధ్, కాసర్ల శ్యామ్ కాంబినేషన్‌లో రాబోతున్న రెండో పాటపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈసారి వీరిద్దరూ ఎలాంటి మాస్ నంబర్‌తో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ను సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు