మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ బర్త్‌డే సందర్భంగా చిరంజీవి నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్పై కూడా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చేయబోయే సినిమా విషయంలో కొంతకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగి చాలా కాలమే అయినా.. చిరంజీవి ఇతర సినిమాలను ముందుగా పూర్తి చేస్తుండటంతో శ్రీకాంత్ ఓదెల సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అసలు ప్రాజెక్ట్ ఉందా? లేదా ఆగిపోయిందా? అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
చిరు–ఓదెల ప్రాజెక్ట్‌పై క్లారిటీ
అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన తాజా పోస్ట్‌తో ఈ అనుమానాలన్నింటికీ దాదాపు చెక్ పడింది. మెగాస్టార్‌ను ‘T-REX’ అంటూ సంబోధించిన శ్రీకాంత్ ఓదెల.. తమ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. చిరంజీవితో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించేందుకు వెయిట్ చేస్తున్నానంటూ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఈ పోస్ట్‌కు చిరంజీవి కూడా స్పందించడంతో అభిమానుల్లో మరింత క్లారిటీ వచ్చింది. అంటే చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడా ఆగిపోలేదని, సరైన సమయంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు వచ్చాయి. తాజా రిపోర్టుల ప్రకారం కూడా ఈ సినిమా షెల్వ్ కాలేదని తెలుస్తోంది.
ఎలా ఉండబోతోంది ఈ సినిమా?
శ్రీకాంత్ ఓదెల గతంలో ‘దసరా’తో తనదైన మాస్ మార్క్‌ను చూపించగా.. ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక చిరంజీవితో చేయబోయే సినిమా కూడా డిఫరెంట్, వైలెంట్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే ప్రచారం ఉంది. గతంలోనే దర్శకుడు ఈ సినిమాలో అభిమానులు మిస్ అవుతున్న చిరంజీవిని తిరిగి చూపిస్తానంటూ హామీ ఇచ్చారు.
ఇక ఈ కాంబినేషన్‌పై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి ఇతర కమిట్మెంట్స్ను పూర్తి చేసిన తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మొత్తానికి ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఉన్న సస్పెన్స్‌కు చిరంజీవి బర్త్‌డే రోజు శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన అప్డేట్తో క్లారిటీ వచ్చినట్టే. మరి మెగాస్టార్‌ను శ్రీకాంత్ ఓదెల ఎలాంటి అవతారంలో చూపించబోతున్నాడు? ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








