Search
Close this search box.

  చిరంజీవి బర్త్‌డేకు ‘విశ్వంభర’ సర్‌ప్రైజ్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం..!

August 22, 2026 10:25 PM | Aditya369 News

చిరంజీవి బర్త్‌డేకు ‘విశ్వంభర’ సర్‌ప్రైజ్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం..!

అసలు వస్తుందా.. రాదా అంటూ ఇన్ని రోజులు ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ‘విశ్వంభర’ మూవీ టీమ్ ఎట్టకేలకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందా లేదా అనే ఉత్కంఠకు తెరదించుతూ.. స్పెషల్ పోస్టర్‌తో పాటు పవర్‌ఫుల్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఎప్పటినుంచో అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అంచనాలు పెంచేసిన పోస్టర్
‘విశ్వంభర’ నుంచి వచ్చిన ఈ పోస్టర్ విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకుముందు కనిపించని విధంగా చాలా ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా చిరు కనిపించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇక చిరంజీవి చేతిలో పరమశివుడి త్రిశూలాన్ని గుర్తు చేసే భారీ ఆయుధం కనిపించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆ ఆయుధంపై ఉన్న అరుదైన రత్నం నుంచి వెలువడుతున్న కాంతి చిరంజీవి కంటిపై పడేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ముఖ్యంగా గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న చిరు కన్ను చూస్తుంటే సినిమాలో భారీ విజువల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయనే హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది.

ఒక్క పోస్టర్‌తోనే ‘విశ్వంభర’లోని ఫాంటసీ ప్రపంచం ఏ స్థాయిలో ఉండబోతోందో మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.
OSTతో గూస్‌బంప్స్
పోస్టర్ ఒక ఎత్తయితే.. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ మరో ఎత్తు. సంస్కృత శ్లోకాలతో పాటు భారీ ఆర్కెస్ట్రా మ్యూజిక్‌ను కలిపి రూపొందించిన ఈ ట్రాక్ ప్రస్తుతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

థియేటర్లలో ఈ సౌండ్‌కు విజువల్స్ కూడా తోడైతే గూస్‌బంప్స్ రావడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు గౌరా హరి వర్క్ చేయగా.. సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవికి జోడీగా త్రిష
‘బింబిసార’తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వశిష్ఠ ఈ సోషియో-ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా.. అషికా రంగనాథ్, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇక సినిమాకు సంబంధించిన VFX పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే సినిమా విడుదలలో కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంత మంచి అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్.. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించి ఉంటే ఇంకా బాగుండేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా సినిమా కాస్త ఆలస్యంగా వచ్చినా.. భారీ విజువల్స్, చిరంజీవి ఇమేజ్, పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

మొత్తానికి ఇన్ని రోజులు ఎలాంటి అప్‌డేట్ లేక డీలా పడిపోయిన మెగా అభిమానులను.. ఈ ఒక్క పోస్టర్, పవర్‌ఫుల్ OSTతో ‘విశ్వంభర’ టీమ్ మళ్లీ ఫుల్ జోష్‌లోకి తీసుకొచ్చిందనే చెప్పాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు