గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు అమెరికాలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
అమెరికా వ్యాప్తంగా 2,000కు పైగా స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు అధికారిక డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. ఈ స్థాయి విడుదలతో ‘టాక్సిక్’ అమెరికాలో అత్యధిక స్క్రీన్లలో విడుదలయ్యే భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ చిత్రం 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో విడుదల కానుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో యశ్ సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, బాలాజీ మనోహర్, అమిత్ తివారీ, సురజిత్ గోపినాథ్ వంటి ప్రముఖ నటీనటులతో పాటు అంతర్జాతీయ నటులు డారెల్ డి’సిల్వా, కైల్ పాల్, బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మొత్తానికి ‘టాక్సిక్’ సినిమా భారీ స్థాయి విడుదలతో పాటు స్టార్ కాస్ట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటోంది.








