Search
Close this search box.

  మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి గెస్ట్ రోల్.?

August 10, 2026 8:16 PM | Aditya369 News

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి గెస్ట్ రోల్.?

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో ఆసక్తికరమైన సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనుండగా, ఆమెది ప్రధాన హీరోయిన్ రోల్ కాకుండా గెస్ట్ అపియరెన్స్ అని తెలుస్తోంది. కథలో ముఖ్యమైన మలుపులో ఆమె పాత్ర ఉండబోతుందని టాక్.

ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో చిరంజీవి పూర్తిగా కొత్త లుక్‌లో, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో కనిపించనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలో చిరు పాత్రలో పలు వేరియేషన్స్ ఉంటాయని, ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా పెద్దపీట వేయబడిందని, వినూత్నమైన స్టోరీతో ఈ సినిమా ముందుకు రానుందని సమాచారం. చిరంజీవిని కొత్త కోణంలో చూపించాలనే ఉద్దేశంతో బాబీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ భారీ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్‌పై మరింత అంచనాలు పెరిగాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు