మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘U/A’ సర్టిఫికెట్ ఇవ్వగా, 2 గంటల 36 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ షో చూసిన వారి నుంచి వస్తున్న ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుండగా, ఆయన ట్రాన్స్ఫార్మేషన్, రెండు పాత్రల మధ్య చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని టాక్. దర్శకుడు మెర్లపాక గాంధీ రూపొందించిన కామెడీతో కూడిన కథ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చెబుతున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయని, వీరి కాంబినేషన్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.
తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చిందని, పవర్ఫుల్ డైలాగ్స్, పంచ్ లైన్స్ ప్రేక్షకులను అలరిస్తాయని సమాచారం. సినిమాటోగ్రఫీ కూడా విజువల్ ట్రీట్‌లా ఉందని, హీరోయిన్ రితిక నాయక్ పాత్రకు మంచి ప్రాధాన్యత లభించిందని టాక్. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని ఇన్సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా ఈ పాజిటివ్ టాక్ కొనసాగితే ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.








