ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్ మరియు హై-ఎండ్ టెక్నికల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే, ఈ చిత్రం కథాంశం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమానా, మైథాలజికల్ డ్రామానా, లేక పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ నేపథ్యంలో ‘రాకా’ వరల్డ్ గురించి త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడించనున్నట్లు అల్లు కుటుంబానికి సన్నిహితుడు శరత్ చంద్ర నాయుడు తెలిపారు. అట్లీతో పాటు సన్ పిక్చర్స్ ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, వరల్డ్ బిల్డింగ్‌పై ప్రత్యేక అప్డేట్ ఇవ్వనున్నారని ఆయన వెల్లడించారు.
దీంతో ‘రాకా’ అసలు నేపథ్యం ఏమిటన్న ఆసక్తికి త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు.








