Search
Close this search box.

  క్లైమాక్స్ షూట్‌లో నాని ‘ది ప్యారడైజ్’..!

July 24, 2026 11:19 AM | Aditya369 News

క్లైమాక్స్ షూట్‌లో నాని ‘ది ప్యారడైజ్’..!

టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ కూడా ఒకటి. గతంలో నానితో సూపర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో, ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల క్రియేట్ చేస్తున్న కొత్త ప్రపంచాన్ని తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో సినిమా విడుదలపై కొంత సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం చిత్ర బృందం భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

క్లైమాక్స్ షూట్ పూర్తైన తర్వాత మరికొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ పనులన్నీ పూర్తయ్యాక మూవీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

‘ది ప్యారడైజ్’ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లో మరో భారీ చిత్రంగా నిలవబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు