Search
Close this search box.

  ఫోక్ సింగర్ నుంచి హీరోయిన్‌గా.. నాగదుర్గకు బిగ్ ఛాన్స్..!

June 19, 2026 10:57 PM | Aditya369 News

ఫోక్ సింగర్ నుంచి హీరోయిన్‌గా.. నాగదుర్గకు బిగ్ ఛాన్స్..!

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలిసి హీరో ప్రియదర్శితో ఓ కొత్త సినిమాను నిర్మించబోతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే సినీ వర్గాల్లో మంచి చర్చకు దారి తీసింది.

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాతో తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్, నటి నాగదుర్గ టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ఇప్పటికే ఆమె పాడిన పలు తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్ సాధించి భారీ గుర్తింపు తెచ్చుకున్నాయి.

ఇప్పుడు అదే క్రేజ్‌తో నాగదుర్గ వెండితెరపై హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందించనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథను యువ దర్శకుడు వంశీ రెడ్డి తెరకెక్కించనున్నారు. గ్రామీణ భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, తెలంగాణ నేటివిటీ ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న అధికారికంగా ప్రారంభం కానుంది. అనంతరం వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండగా, నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు