Search
Close this search box.

  ‘విశ్వంభర’కు రిలీజ్ మోక్షం ఎప్పుడూ..? మెగా ఫ్యాన్స్ ఫైర్..!

May 28, 2026 12:39 PM | Aditya369 News

‘విశ్వంభర’కు రిలీజ్ మోక్షం ఎప్పుడూ..? మెగా ఫ్యాన్స్ ఫైర్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. అయితే సినిమా విడుదలపై మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడం మెగా ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా చిరంజీవి ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే దిశగా వెళ్లిపోగా, తాజాగా దర్శకుడు బాబీ కొల్లితో ‘మెగా 158’ను కూడా ప్రారంభించి షూటింగ్‌కు రెడీ అవుతున్నారు.

కానీ వీటన్నింటికంటే ముందే పూర్తి అయిన ‘విశ్వంభర’ మాత్రం ఇంకా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ వచ్చిన తర్వాత అయినా ‘విశ్వంభర’ రిలీజ్‌పై అప్డేట్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ దర్శకుడు వశిష్ఠ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మొదట్లో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్, ఇప్పుడు అప్డేట్స్ లేక విసిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ట్రైలర్ వస్తుందని ప్రచారం జరిగినా ఇప్పటివరకు దాని జాడ కూడా కనిపించలేదు. కనీసం రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్స్ మొదలు పెడితేనే సినిమాపై మళ్లీ హైప్ పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. లేదంటే ‘విశ్వంభర’పై ఉన్న బజ్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore