టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో మరో ఆసక్తికరమైన అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రామ్.. ఇప్పుడు తన 23వ చిత్రంతో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాతో దర్శకుడిగానూ మారబోతున్నట్టు ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా.. జూన్ నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. రామ్‌కు జోడీగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టిని తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ ‘వీరా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు.. ఈ కథను స్వయంగా రామ్ సిద్ధం చేయడం విశేషం. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో రామ్ కొత్త అవతారం ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








