తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతనేని త్వరలో దర్శకుడిగా మారబోతున్నారనే వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘దేవదాసు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్.. తన ఎనర్జీ, స్టైలిష్ డ్యాన్సులు, మాస్ యాక్టింగ్‌తో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు కెమెరా వెనుక కొత్త ప్రయాణం మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
రామ్ ప్రస్తుతం తన 23వ చిత్రానికి సంబంధించిన భారీ ప్లాన్‌లో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను మరింత స్పెషల్‌గా మార్చేది ఏంటంటే.. ఈ సినిమాకు స్వయంగా రామ్ దర్శకత్వం వహించనున్నారట. ఇది ఆయన ఎంతోకాలంగా కలగన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా.. తన విజన్‌ను పూర్తిగా తెరపై చూపించాలనే ఉద్దేశంతో ఆయనే మెగా ఫోన్ పట్టుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండగా.. అభిమానులు కూడా ఆ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోగా మాత్రమే కాదు.. దర్శకుడిగానూ రామ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.
ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా S. తమన్ పనిచేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక పూర్తయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మొత్తానికి.. హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న రామ్.. ఇప్పుడు దర్శకుడిగా కూడా కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారనే టాక్ టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.








