కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి టాలీవుడ్లో కూడా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన న్యాచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు ఓ యంగ్ టాలీవుడ్ డైరెక్టర్‌తో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. ‘మ్యాడ్’ సినిమాతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఇప్పుడు కార్తీతో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించబోతున్నారు.
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన సినిమా..
కార్తీ – కళ్యాణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ కాంబోపై సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ నెలకొంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ నిర్మాణం..
టాలీవుడ్లో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కార్తీకి జోడిగా మీనాక్షి చౌదరి..
ఈ సినిమాలో కార్తీ సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షి.. కార్తీతో తొలిసారి జోడీ కడుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందా అని మూవీ లవర్స్ ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.
‘మ్యాడ్’ హ్యూమర్‌కు కార్తీ యాక్షన్ టచ్..
దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో యూత్‌కు కనెక్ట్ అయ్యే కామెడీని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. మరోవైపు కార్తీ తన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా ప్రేక్షకులను కట్టిపడేయగల నటుడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు.
త్వరలో రెగ్యులర్ షూటింగ్..
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. సినిమా టైటిల్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో కార్తీ నటించిన ‘ఊపిరి’, ‘ఖైదీ’ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న నేపథ్యంలో.. ఈ స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ క్రేజీ కాంబో ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో చూడాలి.








