Search
Close this search box.

  ‘ది ప్యారడైజ్’ ఎఫెక్ట్…! నానికి మూడు బిగ్ ప్రాజెక్ట్స్ మిస్..?

April 23, 2026 11:48 PM | Aditya369 News

‘ది ప్యారడైజ్’ ఎఫెక్ట్…! నానికి మూడు బిగ్ ప్రాజెక్ట్స్ మిస్..?

న్యాచురల్ స్టార్ నాని సాధారణంగా తన సినిమాలను వేగంగా పూర్తి చేసి, కచ్చితమైన ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు. కానీ, గత ఏడాది మేలో విడుదలైన ‘హిట్-3’ తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా రాకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నాని కెరీర్ స్పీడ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్, రిలీజ్ డేట్ గురించి ఇండస్ట్రీలో పలు చర్చలు సాగుతున్నాయి.

ఈ ఆలస్యమే నానికి కొన్ని క్రేజీ ప్రాజెక్టులను దూరం చేసింది. ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయాల్సిన సినిమా ఇప్పుడు విజయ్ దేవరకొండకు వెళ్లింది. అలాగే సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయింది. ఇక ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ నాని కోసం సిద్ధం చేసిన కథను, డేట్స్ సమస్యల కారణంగా ఇప్పుడు సూర్యతో తెరకెక్కిస్తున్నారు.

ఇంకా, సుజిత్ దర్శకత్వంలో ప్రకటించిన ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ కూడా ‘ది ప్యారడైజ్’ ప్రభావంతో వెయిటింగ్‌లో పడింది. నాని షూటింగ్ పూర్తి చేసే వరకు సుజిత్ టీమ్ ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నాని, ఒక్క సినిమా ఆలస్యంతోనే మూడు భారీ అవకాశాలను కోల్పోవడం అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు