అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించి, వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమ్ ఇండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, ఈ అద్భుత విజయంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తనదైన శైలిలో చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
భారత జట్టు విజయం సాధించిన వెంటనే అమితాబ్ స్పందిస్తూ.. “నేను మ్యాచ్ చూడకపోతే భారత్ గెలుస్తుందని ముందే చెప్పాను.. అలాగే జరిగింది” అని సరదాగా ట్వీట్ చేశారు. నిజానికి అమితాబ్ బచ్చన్‌కు ఒక వింత సెంటిమెంట్ ఉంది. తాను లైవ్‌లో మ్యాచ్ చూస్తే టీమ్ ఇండియాకు కలిసిరాదని, జట్టు ఓడిపోయే అవకాశం ఉంటుందని ఆయన బలంగా నమ్ముతుంటారు. అందుకే ఈ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఆయన చూడకుండా తన సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. తన ఈ ‘త్యాగం’ వల్లే భారత్ గెలిచిందనే అర్థంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.
అమితాబ్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. “మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది సార్.. దేశం కోసం ఇకపై కూడా మీరు మ్యాచ్‌లు చూడకుండా ఉండాలి” అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు కూడా “మేము కూడా అలాగే చేశాం.. అందుకే కప్ మనకే వచ్చింది” అంటూ తమ సొంత సెంటిమెంట్లను పంచుకుంటున్నారు. మొత్తానికి టీమ్ ఇండియా గెలుపుతో పాటు బిగ్ బి చేసిన ఈ ట్వీట్ క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకాను అందించింది.








