గత వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి చివరకుమండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం మండలం కూర్మా పురం వద్ద ఫారెస్ట్ రిస్క్యూ టీమ్‌కు చిక్కింది. పాడుపడ్డ ఇంటి వద్దకు వెళ్లిచూసిన గ్రామస్తులపై పెద్దపులి ఒక్కసారిగా గర్జించగా అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఈ సమాచారం అందుకున్న పారెస్ట్ రెస్క్యూటీమ్‌తోపాటు ఫారెస్ట్ అధికాయంత్రాంగం, పోలీసు, రెవిన్యూ యంత్రంగా అంతా అప్రమత్తమై కూర్మాపురం ప్రాంత ప్రజలను అపమత్తం చేశారు. పూణే నుంచి వచ్చిన రెస్క్యూటీమ్, వైజాగ్ నుంచి వచ్చిన నిపుణుల బృందం చుట్టిముట్టింది. టైగర్ ట్రాంక్‌లైజింగ్ గన్ షూటర్లు అయిదుగురు బృందం పులి బయటకు వచ్చే సమయంలో మత్తు ఇంజక్షన్ షూట్ చేయడం ద్వారా పులిని బంధించారు.









