అతి ప్రఖ్యాతిగాంచిన కాకినాడ జిల్లాలోని పొన్నాడ బషీర్బీబీ(బంగారు పాప) దర్గాను శుక్రవారం ప్రారంభించనున్నారు.ఫిబ్రవరి 6వ తేది నుండి మూడు రోజుల పాటు ఇక్కడ బషీర్బీబీ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొన్నాడ బషీర్బీబీ దర్గా దర్శనం సందర్భంగా దర్గాను అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన ఆశయం మేరకు కొత్తపల్లి జనసేన నేత ప్రముఖ వైద్యులు జ్యోతుల శ్రీనివాస్ దర్గా అభివృద్ధికి రూ10 లక్షల ఆర్థికసహకారాన్ని అందించారు. నూతన దర్గా రూపుదిద్దుకోవడంతో శుక్రవారం జనసేన నాయకులు నూతన దర్గాను ప్రారంభించనున్నారు.









