తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం పెద్ద కొండేపూడి-చీపురపల్లి గ్రామాల మధ్య పులి సంచరిస్తున్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు అక్కడ పరిసరప్రాంతవాసులను అలర్ట్ చేస్తున్నారు. పులి అడుగు జాడలను గుర్తించడంతో అప్రమత్తమయ్యారు.









