బండ్ల గణేష్‌తో తనకు మూడు దశాబ్దాలకు పైగా స్నేహం ఉందని, తాను సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతో ప్రోత్సాహం అందించారని శివాజీ తెలిపారు. తాము కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడు, కనీసం ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా గణేష్ తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. సెల్ఫోన్లు లేని ఆ రోజుల్లోనే తనకు పేజర్ కొనిచ్చి, నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయం చేసేవారని శివాజీ ఉద్వేగానికి లోనయ్యారు. చిన్న నటుడిగా మొదలై, నేడు స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక చరిత్ర అని కొనియాడారు.
బండ్ల గణేష్ మాటల మనిషి కాదని, చేతల్లో సాయం చేసే గొప్ప గుణం ఉన్న వ్యక్తి అని శివాజీ ప్రశంసించారు. ఎంతోమందికి ఆస్తులు కూడబెట్టడమే కాకుండా, మరెంతో మందికి సినిమా అవకాశాలు కల్పించారని తెలిపారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, తప్పు చేస్తే నిర్భయంగా ఒప్పుకోవడం ఆయనలోని నిజాయితీకి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయన చేపట్టిన పోరాటం చిన్న చుక్కగా మొదలై నేడు మహా సముద్రంలా మారిందని, ఆయన సంకల్పం గొప్పదని అభినందించారు.
గణేష్ చేపట్టిన ‘సంకల్ప యాత్ర’ విజయవంతం కావాలని శివాజీ ఆకాంక్షించారు. ఈ యాత్రలో తాను కూడా పాల్గొంటానని కోరగా, ప్రారంభోత్సవానికి వస్తే చాలని గణేష్ చమత్కరించినట్లు శివాజీ సరదాగా చెప్పుకొచ్చారు. ఇలాంటి మనసున్న వ్యక్తులు పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారని, ఆయన తనకు స్నేహితుడు కావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని బండ్ల గణేష్‌కు మద్దతు తెలిపార









